అక్బరుద్దీన్ ఆరోగ్యం ఆందోళనకరం… లండన్ తరలింపు
1 min read
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు, చాంద్రాయణగుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై కొంతకాలం క్రితం దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాల్పులు, కత్తిపోట్లకు గురైన అక్బరుద్దీన్ ఆ ఘటనలో బతికిబయటపడడం అదృష్టమనే చెప్పాలి. అయితే, అప్పటినుంచి ఆయన ఆరోగ్యం నిలకడ కోల్పోయింది. దాడిలో తీవ్రగాయాలపాలవడంతో ఇప్పటికీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
తాజాగా, మరోసారి అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను హుటాహుటీన లండన్ తరలించినట్టు సమాచారం. మెరుగైన వైద్యం కోసం లండన్ తీసుకెళ్లాలంటూ హైదరాబాద్ వైద్యులు సూచించిన నేపథ్యంలో, అసద్ తన తమ్ముడ్ని అత్యవసరంగా విదేశాలకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తన సోదరుడు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయాలని అసద్ ఎంఐఎం అభిమానులకు విజ్ఞప్తి చూశారు.