JMS News Today

For Complete News

ఆషాడ బోనాల ఉత్సవం.. ఏర్పాట్లపై నేడు సమీక్ష

1 min read

హైదరాబాద్: వచ్చే నెల జూలై మాసంలో రాష్ట్ర రాజధాని లో జరిగే ఆషాడ బోనాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగనుంది. గోల్కొండ, సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారి బోనాలు, పాత బస్తీలలో నిర్వహించే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, సౌకర్యాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్, నగర పోలీసు కమిషనర్ అంజన్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, నగర పరిధిలోని శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ ఆలయాల కమిటీ చైర్మైన్‌లు, అధికారులు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *