ఈనెల 20న జీఎస్టీ సమావేశం
1 min read
ఢిల్లీ: ఈనెల 20న న్యూడిల్లీ లో జీఎస్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బిజినెస్ టు బిజినెస్ అమ్మకాల కోసం కేంద్రీకృత ప్రభుత్వ పోర్టల్‌పై ఈ- ఇన్వాయిస్ పొందడానికి టర్నోవర్ పరిమితిని రూ.50 కోట్లుగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించే అవకాశాలున్నాయి. జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తిసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రాలతో సంప్రదింపుల తర్వాత ఈ- ఇన్వాయిస్ జారీ కోసం టర్నోవర్ పరిమితిపై ఓ తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.