ఏపీ ఎక్స్ ప్రెస్ లో పని చేయని ఏసీలు
1 min read
ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వెళుతున్న ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో, సుమారు గంటకు పైగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ లో రైలు నిలిచిపోయింది. ఏసీలు పనిచేయకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఏపీ ఎక్స్ ప్రెస్ నిర్వహణ తీరు సరిగా లేదని పలువురు ప్రయాణికులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై రైల్వే అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు లేకపోలేదు. గత వారం గోదావరి ఎక్స్ ప్రెస్ లోని సాధారణ బోగీల్లో కూడా ఫ్యాన్లు సరిగా పనిచేయలేదు. విశాఖ-హైదరాబాద్ వచ్చే ఈ ఎక్స్ ప్రెస్ లోని టాయిలెట్లలో నీటి సమస్య తలెత్తడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.