తిరుమల చేరుకున్న ప్రధాని మోడీ
1 min read
ప్రధాని నరేంద్ర కొద్ది సేపటి క్రితంమోదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీకి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పలువురు వైసీపీ, బీజేపీ నేతలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.
అనంతరం, రేణిగుంట ఎయిర్ పోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరుమలకు మోదీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు తిరుమల శ్రీవారిని సందర్శించుకోనున్నారు. అనంతరం, రాత్రి 8.15 గంటలకు తిరిగి ఢిల్లీకి మోదీ బయలుదేరి వెళతారని సమాచారం.