JMS News Today

For Complete News

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తప్పదా…?

1 min read

హైదరాబాద్: కాంగ్రెస్ కు మరో షాక్ తగులనుందా అంటే గత కొద్ది రోజులుగా జోరుగా జరుగుతున్న ప్రచారం బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే అధికార తెరాస వ్యవహరించిన వ్యూహంలో మెజారిటీ ఎమ్మెల్యేలను కోల్పోయి విలవిలలాడుతున్న కాంగ్రెస్  ఇద్దరు ఎంపీలు బిజెపి లో చేరతారనే ప్రచారం ఆ పార్టీని ఆందోళన కు గురిచేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానానికి పరిమితమైన బిజెపి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఆ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలో మరోమారు అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ తెలుగు రాష్ట్రాలపై నజర్ వేసి, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా తెలంగాణ లో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు, అందులో భాగంగా నే కాంగ్రెస్ ఎంపీలపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఆ ఇద్దరు కాషాయం వైపు చూస్తే కనుక తెలంగాణ కాంగ్రెస్ కు గట్టి షాక్ అనే చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *