తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు , రేపు తేలికపాటి వర్షాలు
1 min read
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు , రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు ఒకట్రెండ్రు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. రేపు రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు విస్తరిస్తాయని, ఈ నెల 13న తెలంగాణలోకి చేరతాయని తెలిపింది. ఈ నెల 15 నాటికి రాష్ట్రమంతటా విస్తరించనున్నట్లు పేర్కొంది.