నూతన జైడ్మీ చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల కు సీఎం దిశానిర్ధేశనం
1 min read
హైదరాబాద్: ఇటీవల పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన జైడ్మీ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లతో ప్రగతి భవన్లో మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ముందుగా వారందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని జెడ్పీ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ప్రగతి సాధనలో ప్రజాప్రతినిధులు క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాల వికాసంలో ముందుండే జెడ్పీలకు రూ.10 కోట్ల అభివృద్ధి నిధులిస్తామని ఈ సందర్బంగా సీఎం హామీ ఇచ్చారు.