భట్టి దీక్ష భగ్నం… నిమ్స్ కు తరలింపు
1 min read
హైదరాబాద్: సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన నిరవధిక దీక్షను సోమవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. ఇందిరా పార్క్ దగ్గర భట్టి మూడ్రోజులుగా దీక్ష చేస్తున్నారు. శనివారం నుంచి ఆయన ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో బీపీ, షుగర్ స్థాయిలు పడిపోయాయని వైద్యులు చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు భట్టి దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా , కొద్దిసేపు చికిత్సకు సహకరించలేదని సమాచారం.