రోజా భవితవ్యం ఏమిటో …
1 min read
ఏపీలో మంత్రివర్గ విస్తరణ అలకపాన్పులకు కారణం అయ్యింది. పాతికమందితో సీఎం జగన్ తన క్యాబినెట్ ప్రకటించాక, వైసీపీలో పైకి కనిపించకపోయినా చాలమంది నిరాశకు లోనయ్యారు . చివరినిమషం వరకు మంత్రి పదవి ఖాయమని నమ్మిన రోజా లాంటి వాళ్లు హతాశులయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యాబినెట్ ప్రమాణస్వీకారంలో కూడా ఆమె కనిపించలేదు. అయితే, రోజాను బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం.
ఆర్టీసీ చైర్మన్ పదవికి నామినేట్ చేస్తామని ఆయన చెప్పగా, రోజా సంతృప్తి చెందినట్టు వినికిడి. అయితే, ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు ఇలాంటి నామినేటెడ్ పదవులు చేపట్టడంలో రాజ్యాంగపరమైన అడ్డంకులను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి కూడా రోజా ముందు ఓ ఆప్షన్ లా ఉంచారని ప్రచారం జరుగుతోంది. మరి రోజా భవితవ్యం ఏ పదవితో ముడిపడి ఉందో కాలమే చెప్పాలి!