శిఖర్ ధావన్ సెంచరీ
1 min read
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇటీవల కొంతకాలంగా భారీ స్కోర్లు సాధించడంలో విఫలమవుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ తో తన క్లాస్ చాటుకున్నాడు. ఆసీస్ పై 109 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు చేశాడు. స్టార్క్ బౌలింగ్ లో ఓ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధావన్ అవుటయ్యే సమయానికి టీమిండియా స్కోరు 37 ఓవర్లలో 2 వికెట్లకు 220 పరుగులు. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీకి తోడుగా హార్దిక్ పాండ్య వచ్చాడు. కోహ్లీ 44 పరుగులతో ఆడుతున్నాడు.