హమ్మయ్యా..పైలు కదలిక..వారిలో ఆశలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 9: గత వారం రోజులుగా 95 బ్యాచ్ ఎస్ఐల పదోన్నతులపై పలు పత్రికల్లో కథనాలు వస్తున్న దరిమిలా 95 బ్యాచ్ పోలీసు అధికారుల పదోన్నతుల ఫైల్ ఎట్టకేలకు కదిలింది. 95 బ్యాచ్ సబ్-ఇన్స్ పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి ఇవ్వటం కోసం ఉన్నతాధికారులు 122 మందితో జాబితా సిద్దం చేశారు. ప్రభుత్వం ఓకే చేస్తే ఈ జాబితాలో సీరియల్ నెంబర్లు 54-55 వరకు డీఎస్పీలుగా పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు నెల రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిస్టులోని మిగతా వారికి కూడా ఏడాదిలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి పదోన్నతుల కోసం యేళ్ళకేళ్ళు కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న 95 బ్యాచ్ ఎస్ఐల్లో పదోన్నతుల ఆశలు చిగురించాయి.