డేంజర్ బెల్స్..! ఒక్కరోజే 27కేసులు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గురువారం మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు.
కరోనా వైరస్ తో రాష్ట్రంలో 9 మంది మృతి చెందారని తెలిపారు. గురువారం మరో ముగ్గురు ఆసుపత్రి నుండి డిచ్ఛార్జ్ అయ్యారని, మొత్తం 17 మంది కోలుకున్నారని చెప్పారు. ప్రస్తుతం 128 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఈ రెండు వారాలు ఇంటికే పరిమితం కావాలని మంత్రి రాజేందర్ కోరారు