ఫైనల్ గా…30మంది….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 13: హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గుడువు మంగళవారంతో ముగిసింది.12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సైతం తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఫైనల్ గా 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ నెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. కాగా, అధికార తెరాస నుంచి గెల్లు శ్రీనివాస యాదవ్, భాజపా నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ లు పోటీ పడుతున్నారు.