బల్దియా నగారా మోగింది…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, డిసెంబర్ 23: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బల్దియా ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేేసింది. జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేేయనున్నారు. జనవరి 8 నుంచి నామినేషన్ల స్వీకరణ, జనవరి 10వ తేదీన నామినేషన్లకు చివరి గడువు, జనవరి 11న నామినేషన్ల పరిశీలన, జనవరి14న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు, జనవరి 22న పోలింగ్, జనవరి 25న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. బల్దియా నగారా మోగడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది.