JMS News Today

For Complete News

కొత్తగా మరో నలభై నమోదు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్‌, ఏప్రిల్ 7: తెలంగాణలో మంగళవారం ఒకేరోజు కొత్తగా 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలో 348 కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌-19తో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ఈరోజు వరకు సామాజిక వ్యాప్తి జరలేదని వివరించారు. ప్రతీరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24/7 పరీక్షల నిమిత్తం ఆరు డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు పనిచేస్తున్నట్లు చెప్పారు. మర్కజ్‌ ప్రయాణికులు, వారికి కాంటాక్ట్‌ అయినవారిని ట్రాక్‌ చేసినట్లు తెలిపారు. వీరందరికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *