JMS News Today

For Complete News

ముచ్చటగా మూడో సారి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

డిల్లీ, మే 1: ముచ్చటగా మూడోసారి దేశానికి లాక్ పడింది. కానీ కొంత సడలింపులతో జనానికి రిలాక్స్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ -19 పై విస్తృత సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మే 4 నుంచి 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రులు , మంత్రులు, అంతర్ మంత్రిత్వ శాఖ బృందాలు ఇచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడో విడత లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన కేంద్రం గ్రీన్ జోన్లో పూర్తిగా, ఆరెంజ్
జోన్లలో ఉన్న జిల్లాలకు కొన్ని మినహాయింపులు ఇస్తూ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే జోన్లతో సంబంధం లేకుండా విమాన , రైల్వే , మెట్రో , అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు , హోటళ్లు, రెస్టారెంట్లు , సినిమా హాళ్లు , మాల్స్ , జిమ్ములు సైతం తెరుచుకోవు. గుమిగూడడానికి అవకాశం ఉన్న సామాజిక , సాంస్కృతిక , రాజకీయ , మతపరమైన సమావేశాలకు అనుమతివ్వబోమని హోంశాఖ స్పష్టం చేసింది. కాగా, లాక్ డౌన్ పొడిగించడం ఇది మూడో సారి. తొలిసారి 21 రోజుల లాక్ డౌన్ ను మార్చి 24న ప్రధాని మోదీ ప్రకటించారు. అది పూర్తి కాక ముందే మరోసారి మే 3 వరకు లా డౌన్ పొడిగించారు. తాజాగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించడం గమనార్హం. అయితే కొన్ని సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. రెడ్ జోన్ల లో ఏలాంటి సడలింపులు లేవు. గ్రీన్ జోన్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం ఆరెంజ్ జోన్ లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేసింది. ఇలా కొన్ని సడలింపులు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి కరోనా పుణ్యమా అని ముచ్చటగా మూడో సారి దేశానికి లాక్ పడటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *