JMS News Today

For Complete News

74ఏళ్ళ బామ్మ…తల్లి అయిన వేళ…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

తూర్పుగోదావరి, సెప్టెంబర్ 5: ఓ బామ్మ కోరిక నెరవేరింది. 74ఏళ్ల వయసులో ఓ బామ్మ కవలకు జన్మనిచ్చి తల్లి కావాలనే కలను సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే…తూర్పు గోదావరి జిల్లా నేలపర్తిపాడుకు చెందిన రాజారావు, మంగాయమ్మలకు 1962 మార్చి 22న వివాహం జరిగింది. అయితే, ఈ దంపతులకు ఏళ్ళు గడుస్తున్నా…పిల్లలు కలగడం లేదు. పిల్లల కోసం పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు. వారి ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి ఆడుగిడారు. అయినా, తల్లి కావాలనే కోరిక మంగాయమ్మలో బలంగా ఉండేది. ఈ క్రమంలో ఆమెకు పొరుగున ఉండే 55 ఏళ్ళ వయసులో కృత్రిమ సంతానం సాఫల్య విధానంతో తల్లి అయ్యింది. ఈ విధానం ద్వారా అమ్మను కావాలని నిర్ణయించుకున్న మంగాయమ్మ గతేడాది వైద్యులను సంప్రదించింది. ఈ ఏడాది జనవరిలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా గర్భం దాల్చింది. గురువారం మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. గతంలో 70 ఏళ్లకు ప్రసవించిన మహిళా రికార్డును మంగాయమ్మ అధిగమించినట్లయింది. మొత్తానికి ఇద్దరు అమ్మాయిలు జన్మించగా, ఆ దంపతుల కోరిక నెరవేరింది. కాగా, తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *