JMS News Today

For Complete News

ముంబయిలో ఒక్కసారిగా…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ముంబయి, జూలై 16: ముంబయిలో విషాద ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలోని తండెల్‌ వీధిలో నాలుగంతస్తుల భవనం (కేసరీభాయ్‌) మంగళవారం ఉదయం కుప్పకూలింది. భవనం శథిలాల కింద సుమారు 50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీసులతో కలిసి స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ముంబయిలో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఇళ్లు, ప్రహరీలు కూలి పదుల సంఖ్యలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *