JMS News Today

For Complete News

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

డిల్లీ, ఫిబ్రవరి 12: డిల్లీ ఫలితాలు విడుదలైన కొన్ని గంటల్లోనే గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి వేళ జరిగిన ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించాయి. మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నరేశ్ యాదవ్ దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. అనంతరం కాన్వాయ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అశోక్ మన్ అనే కార్యకర్త చనిపోగా, మరొకరు గాయపడ్డారు. ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ ప్రాణాలతో బయపటడ్డారు. కాగా, తమ కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోయామని ఆప్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *