ఏసీబీ కీ చిక్కిన మహిళా హెడ్ మాస్టర్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామగిరి, ఆగస్టు1: పాఠశాల జారీ చేసే ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇచ్చేందుకు ఓ మహిళా హెడ్ మాస్టర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట్ హైస్కూల్ లో గురువారం చోటుచేసుకుంది. సుద్దాల రఘు అనే విద్యార్థికి టీసీ ఇచ్చేందుకు రూ.2వేలు లంచం తీసుకుంటూ హెడ్ మాస్టర్ లలిత ఏసీబీ అధికారులకు చిక్కారు. అనంతరం ఆమెను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఒక హైస్కూల్ హెచ్ఎం టీసీ కోసం విద్యార్థి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డటం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.