ఏసీబీకీ చిక్కిన లంచావతారి…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
పెద్దపల్లి, జూలై 26: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్నా…లంచాలు తీసుకునే వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇటీవల ఓ మహిళా తహశీల్దార్ ఏసీబీ కి చిక్కిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా గా మరో లంచగొండి అధికారి ఏసీబీ వలలో పడ్డారు. ఇరిగేషన్ డీఈ రవికాంత్ 80 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఓదెల మండలంలో నీటి పారుదల శాఖ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ రాజు బిల్లుల కోసం డీఈ రవికాంత్ కు విన్నవించగా, లక్ష రూపాయల లంచం కావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, శుక్రవారం డిఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పి భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ దాడుల్లో సిఐలు సంజీవ్, రాములు, వేణుగోపాల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రవికాంత్ ను అదుపులో కి తీసుకుని కేసు నమోదు చేశారు.
Very interesting news speed post Anna
tq bro