ఏసీబీ కీ చిక్కిన లంచావతారులు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 22: మత్స్య శాఖ సిబ్బంది
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన గురువారం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్ తోపాటు కార్యాలయంలో పనిచేసే సీనియర్ సహయకుడు నూరుద్దీన్ రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామ సొసైటీ సభ్యత్వం కోసం లంచం డిమాండ్ చేయడంతో సొసైటీ అధ్యక్షుడు ఏల్లా రాజేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.