ఏసీబీకీ చిక్కిన అవినీతి చేప
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 27: జగిత్యాల జిల్లా మల్యాల మండల తహశీల్దార్
కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. జూనియర్ అసిస్టెంట్ పర్వేజ్ రూ.2వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డాడు. బాధితుడు రాజయ్య తన భూమి పహాని ఇవ్వడానికి 2వేల రూపాయలు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.