JMS News Today

For Complete News

జమ్మూకాశ్మీర్ లో ఘోర దుర్ఘటన

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

న్యూఢిల్లీ, జూన్ 27: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోరం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో పదకొండు మంది విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూంచ్ జిల్లాలో కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మొఘల్ రోడ్డు నుంచి షోపియాన్ వెళ్తుండగా పీర్‌కి గాలీ వద్ద మినీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రులను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర గవర్నర్.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *