JMS News Today

For Complete News

దేవదాస్ కనకాల ఇకలేరు…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్‌, ఆగస్టు 2:  ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్ కనకాల శుక్రవారం కన్నుమూశారు. దర్శకత్వం నుంచి సినిమా దర్శకునిగా ఎదిగిన దేవదాస్‌ కనకాల 1945లో జులై 30న యానాంలో జన్మించారు. దేవదాస్‌ స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ. 1971 నవంబరు 21న లక్ష్మీదేవి కనకాల తో దేవదాస్ కనకాల ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (రాజీవ్ కనకాల), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ సుమతో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా.పెద్ది రామారావు తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపిన దేవదాస్ కనకాల ఆ తరువాత బుల్లితెరలోని ‘అమృతం’ అనే సీరియల్‌లో నటించారు. చలిచీమలు, నాగవల్లి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. దేవదాస్ ఎన్నో సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు ఆయన. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులందరికీ నట శిక్షణను ఇవ్వడం విశేషం. కాగా,దేవదాస్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. దేవదాస్ మృతి పట్ల సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేయుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *