ఆ గ్రామంలో విషాదం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 24: జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మూడు మృతదేహలు వ్యవసాయ బావిలో బుధవారం లభ్యం కాగా, గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని అహల్య, బిన్నుగా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.