వాళ్ళింట్లో పెళ్లి సందడి….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే)
హైదరాబాద్, జూన్ 22: ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో వివాహం చేసుకున్నారు. ముంబయికి చెందిన నీలూ షాతో ఆయన వివాహం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ఈ పెళ్లి కి అల్లు అర్జున్ మినహా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహ వేడుక ఐటిసి కోహినూర్ హోటల్ లో నిరాడంబరంగా జరిగింది. కాగా, అల్లు బాబీకి గతంలో నీలిమ అనే యువతితో పెళ్లయింది. విభేదాల కారణంగా 2016లో ఇద్దరూ విడిపోయారు. వీరికి అన్విత అనే కుమార్తె ఉంది. విడాకుల అనంతరం బాబీ చాలాకాలం ఒంటరిగానే ఉన్నారు. అయితే నీలూ షాతో పరిచయం పెళ్లి వరకు వచ్చి చివరకు ఒకటయ్యారు. నీలూ తండ్రి కమల్ కాంత్ ఓ వ్యాపారవేత్త. ముంబయిలో పుట్టిపెరిగిన నీలూ పూణేలో ఎంబీఏ పూర్తిచేసి యోగా శిక్షకురాలిగా కొనసాగుతున్నారు.