అన్ని పరీక్షల్లో “ఆ” విద్యార్థులదే హవా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 17: నీట్-2020 ఫలితాలలో అల్ఫోర్స్ అఖండ విజయం సాధించింది. శుక్రవారం విడుదలైన నీట్ ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో అద్భుత ర్యాంకులు సాధించి విజయ శంఖారావం మ్రోగించారు. పి. శ్రావణి 637 మార్కులతో 603 ర్యాంకు సాధించగా, యం.అభివయ 1384 ర్యాంకు వి.దీక్షిత 2090 ర్యాంకు వి.ఆక్షిత 2327 ర్యాంకు, యం.వంకర్ 3367 ర్యాంకు, పి. నాగవర్ధిని 4743, సాయికీర్తన 611 మార్కులతో 7257 ర్యాంకు, ఆర్. పావని 7264 ర్యాంకు, ఆర్. ఆదితిరెడ్డి 602 మార్కులతో 7538 ర్యాంకు, కే. అనిరుద్ 602 మార్కులతో 7549 ర్యాంకు, వి. దత్తవెంకటసాయి 8655 ర్యాంకు, ఆర్. వీణా స్రవంతి 9000 ర్యాంకు, యల్. మానవ 9731 ర్యాంకు, కే. సాహిత్య 587 మార్కులతో 10803 ర్యాంకు, కే. దుర్గ 591 మార్కులతో 10972 ర్యాంకు, జి. అరవింద్ 11173 ర్యాంకు, షేక్ షా 585 మార్కులతో 11259 ర్యాంకు, యం.సౌమ్య 11557 ర్యాంకు, ఇ. దీక్షిత 11627 ర్యాంకు, కే. ప్రజ్యోత్ 12174 ర్యాంకు, పి.హసిత 13198 ర్యాంకు చొప్పున సాధించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రకటించిన అన్ని ఫలితాలలో ఆల్ఫోర్స్ ముందంజలో ఉండటం విశేషంగా పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, అణునిత్యం పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషివల్ల ఆల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాదించగలిగిందని చెప్పారు. కోవిడ్-19 ప్రభావం వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే సదుద్దేశ్యంతో ఆన్లైన్ క్లాసుల ద్వారా కోచింగ్ అందించడం జరిగిందని వివరించారు. నీట్ ఫలితాల్లో వివిద క్యాటగిరీలలో అద్భుత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలను మనస్ఫూర్తిగా ఆభినందిస్తూ, ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన అద్యాపక, ఆద్యాపకేతర సిబ్బందికి నరేందర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పేదలకు నిజంగా లాభం చేకూర్చే ఉద్దేశం ఐతే ప్రీ lrs చేయవచ్చు !