బాధ్యతలు స్వీకరించిన దేవులపల్లి అమర్
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
విజయవాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకు ఈ అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నలభై మూడు సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశానని, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుగా నా ప్రస్ధానం మొదలైందని చెప్పారు. ఐజెయు అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. 2014 డిసెంబర్ 1 నుంచి 4th ఎస్టేట్ ద్వారా చాలా ప్రాముఖ్యత సంపాదించానని అన్నారు. నాకు అప్పగించిన బాధ్యత గురుతరమైనది, సులభమైనది కాదని పేర్కొన్నారు. ఇరవై నాలుగు గంటలూ మీడియా వ్యవహారాలకు నేను అందుబాటులో ఉంటానని, వ్యక్తిగతంగా నేను అందరు మీడియా మిత్రులను కలుస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చేస్తానని, మీడియాలో కావలసిన అన్ని మార్పులు వచ్చేలా కృషి చేస్తానని, జర్నలిస్టుల సమస్యలను ముందుగా నేనే పట్టించుకుంటానని ఈ సందర్భంగా అమర్ స్పష్టం చేశారు.