JMS News Today

For Complete News

జీ 20లో చర్చిస్తా..!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూన్ 27: అమెరికా వస్తువులపై ఇండియా అదనపు పన్నును వేయడాన్ని  అమెరికా అధ్యక్షుడు తప్పు బట్టారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో తేల్చుకుంటానని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము సుంకాలను పెంచి, దానికి ప్రతిగా ఇండియా పెంచిన సుంకాలను కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం జపాన్‌ లో జరిగే జీ 20 సదస్సులో తాను మోదీతో భేటీ కానున్నానని, ఇదే విషయమై తాను చర్చించనున్నానని అన్నారు. “గత కొన్నేళ్లుగా అమెరికా వస్తువులపై ఇండియా భారీగా సుంకాలను విధిస్తోంది. ఈ విషయమై నేను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడబోతున్నా. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ భారత్ సుంకాలను పెంచింది. దీనిని మేము ఏమాత్రం ఆమోదించబోము. వీటిని వెనక్కు తీసుకోవాల్సిందే” అని ట్రంప్‌ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందో వేేేేచి చూద్దాం మరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *