JMS News Today

For Complete News

అమ్మ వారి పల్లకి మోసిన ఎంపీ….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే. కామ్)

కరీంనగర్, అక్టోబర్ 12: కరీంనగర్ నగరంలోని మహాశక్తి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం శ్రీ సరస్వతి దేవి పూజ, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశిష్ట వస్త్ర అలంకరణతో పూజా కార్యక్రమాలు జరిపించారు. సాయంత్రం మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి పూజ, పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ పల్లకి సేవలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొని అమ్మవారి పల్లకిని మోశారు. రతన్ కుమార్ మాస్టర్ శిష్య బృందంచే నిర్వహించిన శాస్త్రీయ ఆలయ నృత్యాలు భక్తులకు కనువిందు చేశాయి. మహాశక్తి దేవాలయంలో పల్లకీ సేవను తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. కరీంనగర్ నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి మహాశక్తి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు చర్యలు చేపట్టి, తీర్థ ప్రసాద వితరణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *