ఏ శాఖకు ఎంతో మరీ….?
1 min read
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జులై 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జులై 12న కొత్త ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయి బడ్జెట్ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… తొలి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏఏ శాఖకు ఎన్నెన్ని నిధులు కేటాయించనున్నారు ?, ఏ రంగానికి పెద్ద పీట వేయనున్నారు ? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి జగన్ సర్కార్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై అందరి దృష్టి పడింది.