కోడెల కన్నుమూత…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 16: టీడీపీ సీనియర్ నేత, అంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) కన్ను మూశారు. సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోగా, ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా..గత కొన్ని రోజులుగా ఈయన్ను కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉంటే..కోడెలను గుంటూరులో ఆయన అభిమానులు, అనుచరులు ‘పల్నాటి పులి’గా పిలుచుకుంటూ ఉంటారు. కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. కోడెల మరణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తోపాటు పలువురు మంత్రులు, టిడిపి నేేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, కోడెల భౌతికదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కోడెల ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుందని, ఆ నివేదిక ప్రకారం అధికారికంగా ప్రకటిస్తామని డిసిపి శ్రీనివాస్ తెలిపారు.