అర్చకులను ఆదుకోండి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 10: కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న ఆలయాల అర్చకులకు జగన్ సర్కార్ చేయూతనందిస్తున్న మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న ఆలయాల అర్చకులను ఆదుకోవాలని చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ గౌరవ అధ్యక్షుడు జానంపేట మారుతీ స్వామి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిన్న ఆలయాల్లో పనిచేసే ఒక్కొక్క అర్చకుడికి రూ. 5 వేల చొప్పున సాయం అందించేందుకు జగన్ సర్కార్ ప్రకటించిందని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ఆకలి తీరుస్తున్న సీఎం కేసీఆర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న ఆలయాల అర్చకులను కూడా ఆదుకోవాలని మారుతీ స్వామి ఆ ప్రకటనలో కోరారు.