మంత్రి చర్చలు విఫలం..యధావిధిగా సేవలు బంద్
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతిష్టంభన నెలకొంది. ఆసుపత్రి నెట్వర్క్ ప్రతినిధులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం సాయంత్రం జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మంత్రి రాజేందర్ తెలిపారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్ వర్క్ ఆసుపత్రుల ప్రతినిధి తెలిపారు.
ప్రభుత్వం రూ.1,500 కోట్ల మేర బకాయిలు ఉందని, చాలాకాలంగా వాటిని చెల్లించడం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆరోగ్యశ్రీ తో పాటు ఉద్యోగుల, జర్నలిస్టుల హెల్త్ కార్డ్ పథకం సేవలను కూడా గురువారం అర్ధరాత్రి నుంచి నిలిపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 242 ఆసుపత్రులలో సేవలు నిలిచిపోయాయి. మంత్రి చర్చలు ఫలించక పోవడంతో ఆరోగ్య సేవలపై ప్రతిష్టంభన నెలకొంది.