ఆగం చేసిన ఆషాడం ఆఫర్…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 6: ఆషాడం ఆఫర్ మహిళలను ఆగం చేసింది. రూ.10లకే చీర అనగానే పెద్ద సంఖ్యలో ఆ షాపు వద్ద కు చేరుకున్నారు. చీర దక్కించుకోవాలన్న ఊబలాటం చివరకు తోపులాట తో మొదలై తొక్కిసలాట వరకు చేరింది. ఈ ఘటన లో పలువురు మహిళలు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆషాడ మాసం నేపథ్యంలో వ్యాపార వర్గాలు వ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు భారీ లాభాలు అర్జించుట కు *ఆషాడం* సేల్స్ అంటూ భారీ ప్రకటనలు ఇవ్వడం ఇటీవల ఒక ట్రెండ్ గా మారింది. అతి తక్కువ ధరలో చీరలు, నగలు ఇస్తామంటూ మహిళలను ఆకర్షించటానికి మార్కెట్లో ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం మామూలైపోయింది. కరీంనగర్ లో కూడా కొంతమంది వస్త్ర వ్యాపారులు ఆషాడం సేల్స్ అంటూ కిలోల చొప్పున వస్త్రాలను, చీరలను అమ్మడం మరియు పది రూపాయలకే ఒక చీర అంటూ ప్రకటనలు ఇవ్వడం వల్ల అమాయక మహిళలు తక్కువ ధరకే చీరలు వస్తున్నాయంటూ షాపుల ముందు క్యూ కట్టడం మామూలైపోయింది. ఈ క్రమంలో శనివారం కరీంనగర్ నగరంలో కూడా ఒక షాపింగ్ మాల్ వారు 10/- రూపాయలకే ఒక చీర అంటూ పేపర్లో , టీవీలో భారీ ప్రకటనలు ఇవ్వడం వల్ల అది చూసిన మహిళలు పెద్ద ఎత్తున షాపు వద్ద కు చేేేరుకోవడంతో ఒక దశలో తోపులాట జరిగింది. పలువురు మహిళలు గాయపడ్డారు కూడా. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే షాపింగ్ మాల్ వద్దకు వెళ్లి అక్కడ వేల సంఖ్యలో వున్న మహిళలను అందరిని అదుపు చేసి, షాపు యజమానిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఇనస్పెక్టర్ శ్రీనివాస్ రాావు మాట్లాడుతూ పది రూపాయలకు ఒక ఖర్చీఫ్ కూడా రాలేని ప్రస్తుత పరిస్థితుల్లో 10/- రూపాయలకే ఒక చీర ఏ విధంగా వస్తుంది, వాటి నాణ్యత ఎంత అని ఆలోచించాలని మహిళలకు సూచించారు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దు అని, ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని పోలీసు శాఖ తరపున ఆయన కోరారు.