తొలిసారిగా గవర్నర్…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, ఆరు దశాబ్దాల పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. స్వల్ప కాలంలోనే తెలంగాణ చాలా రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, అన్ని రంగాల్లోనూ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతోందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రంలో కరెంట్ కొరత అధికంగా ఉండేదని, కానీ, ఇప్పుడు ప్రజలకు ఆ బాధలు లేవు’ అని తమిళిసై చెప్పారు. అప్పట్లో రైతుల ఆత్మహత్యలు, వలసలు ఉండేవని, విద్యుత్, నీళ్లు, ఎరువుల పరంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని, ఇప్పుడు ప్రజలకు ఈ కష్టాలు ఎదురు కావట్లేదని తెలిపారు. తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నారని, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం పింఛను ఇస్తోందని వివరించారు. కేసీఆర్ కృషితో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది అంటూ గవర్నర్ ప్రసంగించారు.