JMS News Today

For Complete News

రంగారెడ్డి జిల్లాలో దారుణం….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

రంగారెడ్డి, ఆగస్టు 13: వరంగల్ ఘటనలో నిందితుడికి మరణ శిక్ష పడినా…కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రెండుమూడు రోజులకో ఘటన రాష్ట్రంలో వెలుగుచూస్తోంది. తాజాగా, రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పద్మశాలిపురంలో 13 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలరాజ్ అనే వ్యక్తి వెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడుతుండగా, స్థానికులు గమనించారు. వెంటనే బాల్ రాజ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *