హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ హత్య
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 26: హైదరాబాద్ లోని నార్సింగి రోడ్డులో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఆటో డ్రైవర్ చాంద్ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. అల్కాపూర్ టౌన్పిష్ దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.