రేపు ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 31: ఆటో కార్మికుల దినోత్సవ వేడుకలను గురువారం స్థానిక గీతా భవన్ చౌరస్తాలో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో సంఘం గౌరవ అధ్యక్షుడు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొంటారని, ఆటో డ్రైవర్లు విధిగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు సమాజంలో ముందున్నారని, ఆటో డ్రైవర్ల ఆత్మగౌరవం మరింత పెంచే విధంగా ప్రతిఏటా ఆగస్టు 1న ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని జరుపుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మంచి పనులు చేసిన ఆటో డ్రైవర్లను సన్మానిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు బండారి సంపత్ పటేల్, సర్దార్ గుర్మిత్ సింగ్, బుధారపు గోపాల్, మద్దుల రాంగోపాల్ రెడ్డి, అంతగిరి సంపత్, హుస్సేన్, మద్దెల రాజేందర్, నర్సయ్య లతోపాటు పలువురు పాల్గొన్నారు.