భలా..బాలాపూర్ లడ్డూ….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 12: భలా…బాలాపూర్ లడ్డూ..ఈసారి బాలాపూర్ వినాయక లడ్డూ
రూ.17.60 లక్షలు పలికింది. లడ్డూ వేలం పాటలో బాలాపూర్ కు చెందిన కొలన్ రామిరెడ్డి దక్కించుకున్నారు. లడ్డు వేలం పాటను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించగా, ఆసక్తిగా, ఉత్సాహంగా సాగిన వేలం పాటలో 19 మంది పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే హైదరాబాద్ బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. ఈ సంవత్సరం వేలం పాటలో లడ్డూను కొలన్ రామిరెడ్డి రూ.17.60 లక్షలకు దక్కించుకున్నారు. గత సంవత్సరం లడ్డూ ధర రూ.16.60 లక్షలకు పోగా, ఈ సంవత్సరం దానికంటే లక్ష రూపాయలు ఎక్కువగా ధర పలికింది. రెండు కిలోల బరువున్న వెండి పళ్లెంలో ఉంచిన 21 కిలోల లడ్డూను ఉత్సవ నిర్వాహకులు కొలన్ రామిరెడ్డికి అందించారు. కాగా, కొలన్ ఫ్యామిలీ సభ్యులు గతంలో పలుమార్లు లడ్డూను దక్కించుకున్నారన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఉత్సాహాభరితంగా లడ్డూ వేేేేలం పాట కొనసాగింది.