బల్దియా భేష్… ఆఖరి సఫర్ షురూ…
1 min read
బల్దియా భేష్… ఆఖరి సఫర్ షురూ…
ఒక్క రూపాయికే అంత్యక్రియలు
కరీంనగర్: ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు నానా ఇబ్బందులు, అవస్థలు పడే పేద వారికీ మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నది కరీంనగర్ బల్దియా. పేదలకు ఆఖరి సఫర్ పేరిట ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నగర మేయర్ రవీందర్ సింగ్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఆదివారం నగరపాలక సంస్థ లాంచనాలతో…1 రూ. అంతిమ యాత్ర ఆఖిరి సఫర్ పథకం ప్రారంభమైంది కడసారి వీడ్కోలు సాంప్రదాయ బద్దంగా డప్పు చప్పుల్లు… వాయిద్యాల మద్య కొనసాగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని 27 వ డివిజన్ భవాని నగర్ లో మంచాల లలిత మరణంతో పథకం అచరణలోకి వచ్చింది. 1 రూపాయి దరఖాస్తుకు చెల్లించి నగరపాలక సంస్థ లాంచనాలతో కార్యక్రమం కొనసాగింది. అంతిమ యాత్ర ఆఖిరి సఫర్ కార్యక్రమంలో నగర మేయర్ సర్ధార్ రవీంధర్, సానిటేషన్ సూపర్ వైజర్ వేణుగోపాల్ మరియు నగరపాలక సిబ్బంది పాల్గొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ పాడేను కట్టి భజస్కందాలతో మొస్తూ…శవయాత్రను ఘనంగా నిర్వహించారు. పథకం అమలులో కల్పించే సౌకర్యాలను ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంబించారు. ఈ సంధర్బంగా నగర మేయర్ సర్ధార్ రవీంధర్ మాట్లాడు అంతిమ వీడ్కోలు యాత్ర ఓ సామాజిక భాద్యత అన్నారు. దహాన సంస్కారాలు చేయండం దైవ కార్యానికి సమానం అని తెలిపారు. పేద ప్రజల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఆచరణలో పెట్టామన్నారు. నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఈ కార్యక్రమానికి 1.50 కొట్ల రూపాయలను కేటాయించామన్నారు. అంతే కాకుండా ప్రత్యేకంగా ధాతల విరాళం కోసం ఒక అకౌంట్ ను తెరిచామని తెలిపారు. ఒక్క దహాన కార్యక్రమానికి 6 నుండి 10 వేల రూ. మద్య ఖర్చు వచ్చిందని స్పష్టం చేశారు. పాడె కర్రతో మొదలు కొని దహాన కర్రల వరకు నగరపాలక సంస్థ నిధులను ఖర్చు చేశామన్నారు. సాంప్రదాయంగా చేసే కార్యక్రమాలతో పాటు డప్పు చప్పుల్లను, వాయిద్యాలను కూడ ఏర్పాటు చేసి అంతిమ యాత్ర చేశామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొని అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్టక్రమంలో సానిటేషన్ సూపర్ వైజర్ వేణుగోపాల్, జవాన్ త్యాగరాజు, టీఆర్ఎస్ నాయకులు సోహాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.