బతుకమ్మ సంబరాలు…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 3: భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యు) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గణేష్ నగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ ముందు గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీటీసీ గూడెం లక్ష్మీ, మాజీ జడ్పీటీసీ కూన శోభారాణి మాట్లాడుతూ యావత్ తెలంగాణ లో మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని, వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రధాన కూడలి వద్ద ప్రతి ఆడపడుచు ఈ బతుకమ్మ ఆడుతారని ఇలాంటి పండగ ఒక్క మన ప్రాంతానికి ఉండడం మన ఆడ పడుచులు చేసుకున్న అదృష్టం అని కొనియాడారు. ఈ పండగకు ప్రభుత్వం ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసినా వాటిలో కొంత నాణ్యత లేదని, మంచి చీరలు పంపిణీ చేస్తే బాగుండు అని, అలాగే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగకు కేటాయించే నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులు కేటాయించాలని లక్ష్మీ, శోభారాణి డిమాండ్ చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ గాయిని తేలు విజయ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాళ్ళు కిన్నెర మల్లవ్వ, కసిరెడ్డి శ్రీలత, కొయ్యడ మాధవి, బూడిద శైలజ, రేణికుంట లావణ్య, వనిత, అంజలి, సరిత, శోభ, లీల, ఆగమ్మ, జ్యోతి, మిన్ను, రూప, రమ, వనజ తదితరులు పాల్గొన్నారు.