కులవృత్తుల వారిని ఆదుకోవాలి….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 8: కుల వృత్తులపై ఆధారపడే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బిసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు. కరోన వైరస్ నివారణ కోసం భారతదేశం అంత 21 రోజులు లక్డౌన్ విధించడంతో పేద మధ్య తరగతి కుల వృత్తులు చేసుకునే ప్రజల మీద తీవ్రమైన ఆర్థికబారం పడిందని పేర్కొన్నారు. మళ్ళీ లక్డౌన్ ను కొనసాగించాలనడంతో ఇంకా ఆదిక మొత్తంలో భారం పడుతుందని అన్నారు. కుల వృతులవారు రోజు వారి వృత్తి చేస్తేనే వారి కుటుంబం కడుపునిండే పరిస్థితి గ్రామాల్లో ఉంటుందని, మరి కరోన వైరస్ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజులు లక్డౌన్ విధించడం వల్ల ఎవరు కూడా ఎలాంటి పనులకు బయటకు వెళ్లకుండా ఎవరి ఇళ్లలో వాళ్లే ఉండాలని కోరడంతో కులవృతుల వారి పరిస్థితి విషమంగా మారిందని, ప్రభుత్వం ఉచితంగా బియ్యంతో పాటు 1500 నగదు ఇస్తానని చెప్పినప్పటికీ దీనితో నెల మొత్తం కుటుంబం బ్రతికే పరిస్థితి లేదని, కులవృతులు చేసుకునే ప్రజలకు ప్రతి ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు 20 వేలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అలాగే మహిళ సహకార సంఘాలు గ్రామాల్లో బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను కచ్చితంగా కట్టాలని బాంక్ అధికారులు వేధిస్తున్నారని, ప్రభుత్వం వారు 6నెలల వరకు ఎలాంటి వాయిదాలు కట్టనవసరం లేదని, దీనికి ఎలాంటి వడ్డీకుడా తీసుకోమని ఆర్బీఐI బ్యాంక్ వాళ్ళు చెప్పినప్పటికీ గ్రామాల్లో మహిళ సంఘాలను ఒత్తిడి చేస్తున్నారని,. ఈ నేపథ్యంలో కులవృతులవారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.