సన్మానం ద్వారా బీసీల ఐక్యత చాటాలి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 25: బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఘన సన్మానం ద్వారా బీసీల ఐక్యత చాటాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. మంత్రి సన్మాన కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మంత్రి సన్మాన కార్యక్రమం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలువురు బీసీ నాయకులు మాట్లాడారు. మూడవసారి గంగుల కమలాకర్ శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రిగా నియమించడం బీసీల అందరికీ గర్వకారణమని, సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ నెల 30న స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో మంత్రి కమలాకర్ కు నిర్వహించే ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమానికి బీసీల అంతా పార్టీలకతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ చైర్మన్ మెతుకు సత్యం, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, పలువురు బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.