JMS News Today

For Complete News

ఆ ఠాణా ఉత్తమ ఠాణా….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, డిసెంబర్ 3: దేశంలోనే జమ్మికుంట పోలీసు స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ పోలీసు స్టేషన్ లలో జమ్మికుంట ఠాణా పదో స్థానంలో నిలిచింది. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలంచడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహ పూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎంపిక చేస్తుంది. ఈ 2020 సంవత్సరానికిగాను ఎంపిక చేసిన పది ఉత్తమ పోలీస్ స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2019 సంవత్సరంలో చొప్పదండి పోలీస్ స్టేషన్ 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచింది. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన జమ్మికుంట ఠాణా పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంశల జల్లు కురుస్తోంది. దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండవసారి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలవడం పట్ల డీజీపి కరీంనగర్ కమీషనర్ వీ.బీ. కమలాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారితో పాటు ఈ ఘనతను సాధించిన ఇతర పోలీస్ అధికారులను అభినందించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు దక్కిన ఈ పురస్కారం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా ఆదర్శంగా తీసుకోవాలని డిజిపి పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *