నల్గొండ లో బిల్డర్ హత్య
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
నల్లగొండ, జూలై 2 : చైతన్యపురి కాలనీలో ఓ బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమకేశవులు అనే బిల్డర్ను అతని ఇంటి వద్దే కాపు కాసిన దుండగులు కళ్లల్లో కారం కొట్టి దారుణంగా తలపై మోది హత్య చేశారు. సోమకేశవులు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే సోమ కేశవులు హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.