JMS News Today

For Complete News

ఆయనపై బురద జల్లడమేంటీ…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 2: కరీంనగర్ బల్దియా ముందు భాజపా ఆందోళన చేపట్టింది.
కరీంనగర్ స్మార్ట్ సిటీ బచావో..స్మార్ట్ సిటీ హోదాతో కరీంనగర్ ను కాపాడండి…కరీంనగర్ ను అభివృద్ధి చేయండి…అనే నినాదంతో శనివారం బిజెపి జిలా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు తెలంగాణ చౌక్ నుండి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోకుండా, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకుండా స్మార్ట్ సిటీ నిధులు పక్కదారి పట్టించి దుర్వినియోగ పరచడమే కాకుండా తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు స్మార్ట్ సిటీపై తప్పుడు ప్రకటనలతో ఎంపీ బండి సంజయ్ పై బురద జల్లడమేంటని ప్రశ్నించారు. కరీంనగర్ నగర అభివృద్ధిపై టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇచ్చిన స్మార్ట్ సిటీ హోదాను కాపాడుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు సమకూర్చడం లేదని ఆరోపించారు. ఉన్న నిధులను సక్రమంగా సద్వినియోగం చేయకుండా పక్కదారి పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని విమర్శించారు. స్మార్ట్ సిటీ నిధులు సక్రమంగా వినియోగించి పనులు ప్రారంభించకపోతే, ప్రాజెక్టుపై ఆసక్తి లేకపోతే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా కోల్పోవల్సి వస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పలుమార్లు హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నగరంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మోసపూరిత ప్రకటనలతో కాలం గడుపుతుందే కానీ నగర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ డిపిఆర్ ఏంటి? కరీంనగర్ పట్టణాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్న విషయాలు నగరంలోని ప్రజలకు ఎప్పుడైనా సమగ్రంగా వివరించారా అని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం స్మార్ట్ సిటీ హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులను ఒక ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లకు కక్కుర్తిపడి పనులు అప్పగించి, స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగ పరిచి నాణ్యతలేని పనులతో పట్టణాన్ని డస్ట్ సిటీగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. కరీంనగర్ అభివృద్ధిపై సోయిలేని టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు ఎంపీ బండి సంజయ్ ని విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్మార్ట్ సిటీ ని రద్దు చేయించడానికి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని మతిభ్రమించి మాట్లాడుతున్నారని, తప్పుడు ఆరోపణలు చేసే ముందు వినోద్ కుమార్ స్మార్ట్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందో, కేంద్ర వాటాకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా చెల్లించిందో ప్రజలకు వివరించాలని అన్నారు. కేంద్రం విడుదల చేసిన రూ.196 కోట్ల నిధులకు సరిపడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చ కుండా ఉన్న నిధులను పక్కదారి పట్టిస్తుందని కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి.శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, బిజెపి కార్పొరేటర్ లు పెద్ద పెల్లి జితేందర్, కొలగాని శ్రీనివాస్, కచ్చు రవి, బండ సుమ, మర్రి భావన, అనూప్, కాసర్ల ఆనంద్, నాగసముద్రం విజయలక్ష్మి, బిజెపి నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవరెడ్డి, బోయిన పల్లి ప్రవీణ్ రావ్, దుబాల శ్రీనివాస్, బొంతల కళ్యాణ్ చంద్ర, గాజ రమేష్, జే స్వామి, మాడుగుల ప్రవీణ్, రామానుజం, మాసాడి ముత్యం రావు, రఘు, మర్రి సతీష్, నాగసముద్రం ప్రవీణ్, ఆదుర్తి శ్రీనివాస్, పాదం శివరాజ్, లక్ష్మారెడ్డి, వేణు ప్రసాద్ ,కటకం లోకేష్,, దురిశెట్టి సంపత్, బండ రమణారెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, వాసు, లడ్డు ముందాడ, బల్వీర్ సింగ్, జమాల్, మాసం గణేష్, , ప్రసన్న, తోట అనిల్, ఎలుక అభిలాష్ మహిళా నాయకురాలు మామిడి చైతన్య, అరుణ, లావణ్య, సుంకే యశోద, దామెర మాధవి, మాలతి, పద్మ , చంద్రకళ, శిల్ప లతో పాటు వివిధ మోర్చా నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *