JMS News Today

For Complete News

వారికి సంఘీభావంగా..కాషాయ దళపతి జాగరణ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే సవరించాలని, అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని, సవరించిన జీఓ ప్రకారమే బదిలీలు, నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఉద్యోగులకు సంఘీభావంగా ఆదివారం కరీంనగర్ లోని ఎంపి కార్యాలయం వద్ద నిరసన జాగరణ చేపడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ లతోపాటు వివిధ రకాలుగా ఉద్యోగస్తులకు బదిలీలకు సంబంధించి కన్ఫ్యూజ్ చేసే సమాచారం ప్రభుత్వం అందిస్తుందని, ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తూ మానసిక క్షోభకు గురి చేయడం కేసిఆర్ ప్రభుత్వానికి భావ్యం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను నిద్ర లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని సరిదిద్దుకోవాలనే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి 9 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు నిరసన జాగరణ (జాగారం) కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల ,పట్టణ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, బిజెపి అనుబంధ విభాగ ప్రతినిధులందరూ ఇట్టి నిరసన జాగారంలో పాలుపంచుకోని, విజయవంతం చేయాలని కృష్ణారెడ్డి ఆ ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published.